సంఘ విద్రోహశక్తులను ఎదుర్కొనేందుకు మాక్‌డ్రిల్
పెదకాకాని: సంఘ విద్రోహ శక్తులు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు ఆక్టోపస్ డీఎస్పీ కృష్ణ తెలిపారు. మండలంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం రాష్ట్ర ఐజీ శ్రీకాంత్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో డీఎస్పీ కృష్ణ, ఎస్‌బీ సీఐ రాంబాబు సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోపస్ డీఎస్పీ కృష్ణ మాట్లాడుతూ ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు ఎదురైనప్పుడు, అత్యవసర పరిస్థితులు సంభవించినపుడు స్పందించవలసిన విధానాన్ని, వాటిని సమర్ధంగా ఎదుర్కోవడంపై మాక్ డ్రిల్ జరిగిందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవలసి చర్యలు, పటిష్టమైన ప్రణాళికలు రూపొందించి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను అమలు పరచే దిశగా మాక్‌డ్రిల్ కొనసాగిందన్నారు. రాష్ట్ర ఆక్టోపస్ విభాగంలోని డెల్టా బృందం, జిల్లా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బలగాలు, పెదకాకాని పోలీసుల సహకారంతో ఈ మాక్‌డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. ఆక్టోపస్ ఆర్‌ఐ వరప్రసాద్, రామ్‌మోహన్, పెదకాకాని ఎస్‌ఐ రామకృష్ణ, అగ్నిమాపకశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆరోగ్యశాఖ అధికారి రమణమూర్తి, ఆర్‌ఐ శ్రీనివాసరావు, ఏఎన్‌యూ యాజమాన్యం, 30 మంది ఆక్టోపస్ బలగాలు, ఎస్‌టీఎఫ్ బలగాలు, పెదకాకాని పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


