మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుకు సహకరించండి
గుంటూరు వెస్ట్: మాజీ భారత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, నాయకులు మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ నిస్వార్థమైన సేవతో దేశానికి దిశానిర్ధేశం చేసిన మహనీయుడు వాజ్‌పేయి అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని రింగు రోడ్డులోని ఐటీసీ హోటల్, మెడికల్ క్లబ్ ప్రాంతాల్లో ఏర్పాటుకు అనుమతి కోసం వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, బీజేపీ నాయకులు భజరంగ్ రామకృష్ణ, తాడువాయి రామకృష్ణ, దర్శనం శ్రీనివాస్, ఆలపాటి రవికుమార్, తోట శ్రీనివాస్, దేసు సత్యనారాయణ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి


