ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 5వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ విభాగంలో నెలకు రూ.12,500, ఎస్జీటీ విభాగంలో నెలకు రూ.10వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వబడుతుందని తెలిపారు. గుంటూరు జిల్లాలోని 54 స్కూల్ అసిస్టెంట్, మూడు ఎస్జీటీ పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా పని చేసేందుకు అర్హత గల అభ్యర్థులు డీఈవో బ్లాగ్ స్పాట్.కామ్ సైట్‌లో పొందుపర్చిన దరఖాస్తును పూర్తి చేసి, ప్రింటవుట్ కాపీలతో పాటు ధ్రువపత్రాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు ఈనెల 5వ తేదీలోపు అందజేయాలని సూచించారు. ఖాళీల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామని, పెనుమాకలో రెండు ఉర్దూ పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి నగరంలో కొద్ది కాలంగా ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళగిరి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వెంకటరెడ్డి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి విజయవాడలోని పటమటలో నివాసముంటున్నాడు. వంటపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జీవనం కష్టంగా ఉండడంతో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. కొన్ని నెలల కిందట మంగళగిరిలో ఓ ద్విచక్రవాహనాన్ని చోరీ చేసి పారిపోయాడు. పట్టణ పోలీసులు సీసీ కెమెరా పుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో విజయవాడలో మూడు ద్విచక్రవాహనాలు, మంగళగిరిలో మూడు ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఎలాంటి దొంగతనాలకు పాల్పడడం లేదని, తన దగ్గర ఉన్న సొమ్ముతో ఆటో కొనుక్కుని జీవనం సాగిద్దామని భావించినట్లు నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
పెదకాకాని: శివాలయం కేశఖండన శాలలో క్షౌ రవృత్తి చేస్తున్న కొమ్మూరి సదాశివరావు (65) మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి దేవస్థానంలోని గత కొంతకాలంగా తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన కొమ్మూరి సదాశివరావు క్షౌ రవృతిని కొనసాగిస్తున్నాడు. ఏళ్ళ తరబడి వారసత్వంగా వస్తున్న వృత్తిలో కొనసాగుతున్న ఆయనకు మంగళవారం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో అక్కడే కుప్పకూలి మరణించాడు. శివాలయంలో సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు కొనసాగించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం


