అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో బయో డీజిల్ బంక్లో నవంబర్ 23న జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగం భాగ్యారావు (52) మంగళ వారం మృతి చెందాడు. పాలువాయి జంక్షన్ సమీపంలో బయోడీజిల్ దుకాణంలోని స్టీల్ క్యాన్లకు బయో డీజిల్ ట్యాంకర్ వచ్చి బయోడీజిల్ నింపుతుండగా ఇన్వర్టర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో రషీద్(30) అక్కడికక్కడే అగ్నికి ఆహుతైన విషయం పాఠకులకు తెలిసిందే. బయోడీజిల్ దుకాణానికి 10 అడుగుల బయట ఉన్న భాగ్యారావుకు మంటలు అంటుకోవడంతో అక్కడ ఉన్నవారు అతనిని రోడ్డు వద్దకు లాగి దుస్తులు తీసివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే భాగ్యారావును అంబులెన్స్ ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల ప్రవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందినట్లు మృతి చెందినట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.


