ముక్కోటి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను మంగళవారం మంత్రి నారా లోకేష్ తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు రానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ పేర్కొన్నారు. భక్తులకు ప్రచార నిమిత్తం గోడపత్రికలను, ఆహ్వాన పత్రికలను విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైతు సమస్యలు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సీపీఐ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలోని మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై ఈ నెల 10న అన్ని జిల్లాల్లోని మార్కెట్ యార్డుల వద్ద నిరసన తెలుపుతామని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా 17 మెడికల్ కాలేజీల వద్ద 18న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పే ఆలోచనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముక్కోటి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ


