రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! | Sakshi
Sakshi News home page

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!

Published Thu, May 9 2024 2:07 PM

​Vijay Devarakondas Diet And Fitness Secrets

టాలీవుడ్‌ రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్‌ దేవకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడటానికి మంచి స్టైయిలిష్‌ లుక్‌తో కండలు తిరిగిన బాడీతో మంచి ఫిట్‌నెస్‌గా ఉంటాడు. అమ్మాయిల కలల రాకుమారుడిలా క్రేజీ లుక్‌తో ఎట్రాక్ట్‌  చేస్తుంటాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌  స్టార్‌గా మారి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకున్న ఈ రౌడీ హీరో పిట్‌ నెస్‌ రహస్యం ఏంటో తెలుసుకుందామా..!

వర్కౌట్లు..
కండలు తిరిగిన టోన్డ్‌ ఫిజిక్‌ని మెయింటెయిన్‌ చేసేందుకు తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా అధిక బరువులు, కార్డియో ఫంక్షన్‌లకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటాయడు. ప్రతిరోజు కనీసం రెండు గంటలు వర్కౌట్‌లకు కేటాయిస్తాడు. ముఖ్యంగా మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండేలా యోగా, మెడిటేషన్‌ వంటివి తప్పనిసరి. 

డైట్‌ ప్లాన్‌..
విజయ్‌ చాలా స్ట్రిక్ట్‌ డైట్‌ ప్లాన్‌ని ఫాలో అవుతాడు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. ముఖ్యంగా జీవక్రియను చురుకుగా ఉంచేందుకు అతిగా తినకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. ముఖ్యంగా రోజంతా చిన్న చిన్నగానే భోజనం తీసుకుంటాడు. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడు. హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగుతుంటాడు.

ఇక్కడ విజయ్‌ దేవరకొండలా పిట్‌గా ఉండాలంటే మంచి ఫిజిక్‌, తీవ్రమైన వర్కౌట్‌లు, స్ట్రిక్ట్‌ డైట్‌ ప్లాన్‌లు అవసరం అనేది గ్రహించాలి. అలా అని ఎలా పడితే అలా చేసేయ్యకూడదు. ఫిట్‌నెస్‌ కోచ్‌లు, ఆరోగ్య నిపుణులు పర్యవేక్షణలో సలహాలు, సూచనలతో సరైన విధంగా వర్కౌట్‌లు చేయాల్సి ఉంటుంది. 

అలాగే అందుకు తగ్గట్టుగా తీసుకునే డైట్‌ కూడా నిపుణుల సలహాలు మేరకు తీసుకోవాలినేది గ్రహించాలి. అందరికి ఒకలాంటి డైట్‌ప్లాన్‌లు వర్కౌట్‌లు సరిపోవు. ఇక్కడ ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్ర, ఫేస్‌ చేసే హెల్త్‌ సమస్యలు తదితరాలను పరిగణలోనికి తీసుకుని ఎలాంటి వర్కౌట్‌ సెషన్‌లు మంచివి, ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటిని పరిగనలోనికి తీసుకుని ఫాలో అవ్వడం మంచిది. 

(చదవండి: భారతదేశంలో బ్యాన్‌ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!)
 

Advertisement

తప్పక చదవండి

Advertisement