జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అప్‌గ్రేడ్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1కు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. 2023లో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్–1 గా అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు, పాలకవర్గం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అప్పటి నుంచి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 26న మరోసారి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుత సంవత్సర ఆదాయం రూ.6 కోట్లు ఉంటే నిబంధనలు ప్రకారం గ్రేడ్–1 మున్సిపాలిటీ అవుతుంది. ప్రస్తుతం సంవత్సర ఆదాయం రూ.6.5 కోట్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 48,994, ప్రస్తుత జనాభా 70 నుంచి 75 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రేడ్–1గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ ప్రజలపై ఎటువంటి పన్నుల భారం ఉండదని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం 29 వార్డులు ఉండగా, వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2025–26 విద్యా సంవత్సరానికి జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) డిసెంబరు 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్‌సైట్‌లో, పాఠశాల లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సప్ ద్వారా హాల్ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకునే విధానం వెబ్‌సైట్‌లో ఉంచారన్నారు.


