
అబద్ధాల్లో బాబుది గిన్నిస్ రికార్డ్
లింగపాలెం: అలవిగాని హామీలతో గద్దెనెక్కడం తరువాత, వాటిని పక్కన పెట్టడం బాబు నైజమని, ఆయన అబద్ధపు హామీలు లెక్కేస్తే గిన్నిస్ రికార్డుకు ఎక్కడం ఖాయమని చింతలపూడి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు అన్నారు. ధర్మాజీగూడెంలో బుధవారం శ్రీరీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో – బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీశ్రీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ ఈనెల 4న ఏలూరులో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా రూ.1500 చొప్పున ఇస్తామన్న బాబు అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారన్నారు. దీపం పథకంలో ఏడాదికి మూడు సిలిండర్‌లు ఇస్తామన్నారని, సగం మందికి కూడా పథకం డబ్బులు అందడం లేదని విమర్శించారు. ధాన్యం సొమ్ములు నేటికి జమకాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో రోడడ్లు అధ్వానంగా ఉన్నాయని ఇంతవరకు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారే తప్ప ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ధర్మాజీగూడెం సొసైటీ మాజీ అధ్యక్షుడు ఉప్పలపాటి వరప్రసాద్, మండల ముఖ్యనేత ముసునూరి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ మట్టా సురేష్, కొత్తూరి రమేష్, భూపతి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.