
అరకొరగా మందు బిల్లలు
అరకొరగా మందు బిళ్లలు
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, భీమవరం: వృద్ధుల్లో రక్తపోటు అదుపునకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఎటన్‌లాల్ 50 మాత్రలను ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. గతంలో పీహెచ్‌సీలకు క్రమం తప్పకుండా ఈ మాత్రలు సరఫరా జరిగేవి. కొన్ని నెలలుగా వీటి పంపిణీ అంతంత మాత్రంగానే ఉండడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నొప్పులు తగ్గేందుకు వినియోగించే ప్రిగాబ్లిన్ టాబ్లెట్లు, రోగికి సత్తువ కోసం పెట్టే మెట్రోజిల్ సైలెన్లు, జ్వరాలు, నొప్పులకు వివిధ రకాల వ్యాధులను తగ్గించేందుకు వినియోగించే పారాసిటమాల్ 500 ఎంజీ, ఇన్సులిన్, అమాక్సిలిన్ టాబ్లెట్స్, అమాక్స్‌లినన్ ఇంజెక్షన్లు, సిట్రజన్, సిల్వర్ ఎక్స్ తదితర మందులది అదే దారి. ఏ రకం మందులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర మందులతో తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. జిల్లాలో ఒక జిల్లా ఆరోగ్య కేంద్రం, మూడు సీహెచ్‌సీలు, ఐదు ఏరియా ఆస్పత్రులు, 34 వరకు పీహెచ్‌సీలు, 18 యూపీహెచ్‌సీల వరకూ ఉన్నాయి. రోజుకు 15,500 వరకూ ఓపీ నమోదవుతుంది. ప్రతి మూడు నెలలకు ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను వైద్యారోగ్య శాఖ అందిస్తుంది. కొంతకాలంగా క్వార్టర్ కోటా విడుదలతో ప్రభుత్వం కోత పెడుతోంది. మూడు నెలలకు అవసరమైన డ్రగ్స్‌తో ఇండెంట్ పెడుతుండగా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి పూర్తిస్థాయిలో మందులు రావడం లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. గతంతో పోలిస్తే మందులకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి.
పత్తాలేని సురక్ష శిబిరాలు
జగనన్న సురక్ష ద్వారా పేద వర్గాల వారికి రూపాయి ఖర్చు లేకుండా స్పెషలిస్ట్ వైద్యసేవలు పొందే సౌలభ్యాన్ని గత ప్రభుత్వం కల్పించింది. వైద్య సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి బీపీ, సుగర్, హిమోగ్లోబిన్, అవసరాన్ని బట్టి మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించేవారు. జిల్లాలోని విలేజ్ క్లినిక్‌లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి రక్తం, మూత్రం, ఈసీజీ తదితర 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు. స్పెషలిస్ట్ వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది వైద్యసేవలు అందించేవారు. పేదలకు వైద్య భరోసా కల్పించిన ఈ శిబిరాల నిర్వహణను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. గత్ర ప్రభుత్వంలో తమ సమీప ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యసేవల్ని ఉచితంగా పొందిన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు వాటి కోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది.
న్యూస్‌రీల్
అలంకారప్రాయంగా హెల్త్ క్లినిక్‌లు
సాధారణంగా యూనివర్శల్ (యూ), సబ్ డివిజనల్ (ఎస్), టెరిసరీ (టి) కేటగిరీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు మందుల కేటాయింపు చేస్తుంటారు. స్థాయిని బట్టి అలాట్‌మెంట్, బడ్జెట్ కేటాయింపు లుంటాయి. రోజువారీ ఓపీ అధికశాతం నమోదయ్యే పీహెచ్‌సీలకు పూర్తిస్థాయిలో మందుల సరఫరా జరగక వీటికి అనుబంధంగా పనిచేసే హెల్త్ క్లినిక్‌లో్‌ూల్న మందుల కోరత వేధిస్తోంది. హెల్త్ క్లినిక్‌లకు రావాల్సిన మందులు అరకొరగానే సరఫరా అవుతున్నాయి. ఆస్పత్రుల్లో మందులకు కొరత లేదని, అలాట్‌మెంట్ మేరకు పూర్తిస్థాయిలో మందులు సరఫరా చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
కొన్ని మందులు నిలిపివేసిన ప్రభుత్వం
పీహెచ్‌సీలకు 172 రకాలు ఉంచాల్సి ఉండగా కొన్ని మందులను నిలిపివేసిన వైద్య ఆరోగ్యశాఖ మరికొన్ని అరకొరగానే అందజేస్తోంది. సీహెచ్‌సీల్లో 325 రకాల మందులకు 240 రకాలనే సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. బీపీ, సుగర్, దీర్ఘకాలిక వ్యాధులకు మందుల పంపిణీ అరకొరగానే ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యాధిని నయం చేసేందుకు సరైన డ్రగ్ లేక బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోందని రోగులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన సర్వేలో ఉచిత మందులు సక్రమంగా అందడం లేదని 46 శాతం చెప్పగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
ప్రభుత్వ ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో అందని వైనం
మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్న రోగులు
అలంకార ప్రాయంగా హెల్త్ క్లినిక్‌లు
గత ప్రభుత్వంలో అందుబాటులో అన్ని రకాల మందులు
జగనన్న సురక్ష శిబిరాలతో చెంతకే మందులు

అరకొరగా మందు బిల్లలు