
లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు ప్రమాదకరం
భీమవరం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ఎకై ్సజ్‌శాఖ సూపరింటెండెంట్ ఆర్‌ఎస్ కుమరేశ్వరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు ప్రమాదకరమన్నారు. వేడుకలకు మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తామని చెప్పి మోసంచేసే అవకాశముందని హెచ్చరించారు. మద్యం అమ్మకాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలను టోల్‌ఫ్రీ నంబర్: 14405, లేదా సెల్: 98482 03823 నంబర్‌కు సంప్రదించాలని కుమరేశ్వరన్ తెలిపారు.
చికిత్స పొందుతూ వివాహిత మృతి
జంగారెడ్డిగూడెం: మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లక్కవరం ఎస్సై బి.శశాంక తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గౌతు వెంకట రామకృష్ణకు, నాగ వెంకట శిరీష (39)కు 19 ఏళ్ల క్రితం వివాహమైంది. మంగళవారం శిరీష, ఆమె అత్త కోడిపిల్లల విషయమై గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష కలుపు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా, చికిత్స పొందుతూ శిరీష మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లోక్ అదాలత్‌తో
సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి కోరారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్ భవన్ నందు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిలాల్లోని అన్ని కోర్టుల్లో ఈనెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,633 రాజీకాదగిన కేసులు గుర్తించామని, వీటిలో 1,891 క్రిమినల్, 2,501 సివిల్, 241 ఇతర కేసులు ఉన్నాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు జిల్లాలో 34 బెంచ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కక్షిదారులు ఆన్‌లైన్ ద్వారా కూడా తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారాం పాల్గొన్నారు.