
రాంగ్ రూట్లో వచ్చి..
దెందులూరు: రాంగ్ రూట్లో వస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం వైపు నుంచి ఏలూరు వైపు ఐదుగురు కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తున్నారు. సోమవరప్పాడు గ్రామ శివారు వచ్చేసరికి ఏలూరు వైపు నుంచి రాంగ్ రూట్లో వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చే కారులో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా రాంగ్ రూట్లో వస్తున్న కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరికి చేయి విరిగింది. క్షతగాత్రులను దెందులూరు పోలీసులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు.
కారును ఢీ కొట్టిన మరో కారు
ఆరుగురికి గాయాలు

రాంగ్ రూట్లో వచ్చి..