
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం సిటీ: ప్రాధాన్యత భవనాలు, ఇళ్ల నిర్మాణంపై క్షేత్రస్థాయిలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం పంచాయతీ రాజ్, హౌసింగ్ పనితీరుపై క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రాధాన్యత భవనాలు పురోగతి సాధించడంలో క్షేత్ర స్థాయి అధికారుల తొలిదశ పనితీరు అభినందనీయమన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్తున్న లక్ష్య సాధనలో కొంత మేర ప్రగతి చూపడంలో సరైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వారాల లక్ష్యం పూర్తి చేయక పోవడంపై డివిజన్ల వారీగా సమీక్షించారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి 206 భవనాలు అప్పగించాలని, ఆమేరకు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు నిర్మాణ పనులకు సంబంధించి రెండో దశలో 19,253 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో సహాయ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం.భాను ప్రకాష్, పి.సువర్ణ, పంచాయతీ రాజ్ ఎస్సీ ఏబీవీ ప్రసాద్, జిల్లా హౌసింగ్ అధికారి జి.పరశురామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment