ఇక మిలిగింది కొనుగోడు
సాక్షి, అమలాపురం: ముందుచూపు లేదు.. కనీస ఆలోచనా లేదు.. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు సర్కారులో రైతులకు మేలు జరగడం లేదు.. అడుగడుగునా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నా, సంక్షేమాన్ని కనీసం పట్టించుకోవడం లేదు.. ఇప్పుడేమో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టడంతో కోనసీమ వరి రైతులకు చావు దెబ్బతగలనుంది. రైస్ మిల్లుల హబ్‌గా ఉన్న మండపేట నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లా నుంచి విడదీసి తూర్పుగోదావరి జిల్లాలో కలపడం ధాన్యం రైతుల నోట మట్టికొట్టినట్టయ్యింది. ప్రస్తుత ఖరీఫ్‌కు ఇబ్బంది లేకున్నా, రబీ ధాన్యం కొనుగోలు సమయంలో ఆయకట్టు రైతులకు కష్టాలు ఎదుర్కోవడం ఖాయం.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పూర్తి వ్యవసాయ ఆధారితం. పరిశ్రమలు లేని లోటును మండపేట నియోజకవర్గం కొంత వరకూ తీరుస్తోంది. ఇక్కడ పెద్ద ఎత్తున రైస్ మిల్లులు, పౌల్ట్రీలతో పాటు పలు రకాల పరిశ్రమలు ఉన్నాయి. వ్యాపారపరంగా జిల్లాకు ఈ నియోజకవర్గం తలమానికం. ప్రధానంగా రైస్ మిల్లల నుంచి జిల్లాకు సెస్, ట్యాక్స్ రూపంలో రూ.కోట్ల ఆదాయం వస్తోంది. వీటన్నింటికన్నా ముఖ్యంగా వరి సాగు అత్యధికంగా జరిగే ఈ జిల్లాకు ధాన్యం కొనుగోలుకు పెద్దగా ఇబ్బంది లేకుండా ఉందంటే అందుకు మండపేటలో ఉన్న రైస్ మిల్లులే కావడం గమనార్హం.
రైస్ మిల్లుల హబ్‌గా..
మండపేట నియోజకవర్గంలో సుమారు 85 రైస్ మిల్లులు ఉన్నాయి. ఒక్క మండపేట మండలంలోనే 56 మిల్లులు ఉండగా, రాయవరంలో 17, కపిలేశ్వరపురంలో 12 మిల్లుల వరకూ ఉన్నాయి. ధాన్యాన్ని బియ్యంగా మార్చడంలో వీటి సామర్థ్యం కూడా అధికం. మండపేట మినహా ఇప్పుడున్న మిగిలిన జిల్లాలో సుమారు 136 మిల్లులున్నాయి. వీటిలో మీడియం స్థాయి మిల్లులు అధికం. జిల్లాలో మొత్తం ఆయకట్టు సుమారు 2.30 లక్షలు కాగా, దీనిలో ఖరీఫ్ సాగు ఈ ఏడాది 1,56,505 ఎకరాల్లో సాగింది. అధికారుల అంచనా ప్రకారం 4.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, దీనిలో 3.88 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదంతా మోంథా తుపాను ముందు. తరువాత తుపాను వర్షాలకు పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇక రబీ సాగు అధికారుల అంచనా ప్రకారం 1.65 లక్షల ఎకరాలకు పైగానే. రబీ సగటు దిగుబడి 45 బస్తాలు (బస్తా 75 కిలోలు) వస్తుందని అంచనా. వాతావరణం సహకరిస్తే 50 నుంచి 55 బస్తాల వరకూ దిగుబడి వస్తోంది. అధికారుల లెక్కన చూస్తే జిల్లాలో వచ్చే రబీ దిగుబడి అంచనా 5.56 లక్షల మెట్రిక్ టన్నులు. దీనిలో పది శాతం రైతుల అవసరాలకు తీసివేయగా, సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. ఇప్పుడున్న మిల్లులను బట్టి చూస్తే ఒక్కొక్క మిల్లుకు సగటున 2,262 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. కానీ మండపేటను మినహాయిస్తే జిల్లాలో మిగిలిన మిల్లుల ధాన్యం సేకరణ పెరగనుంది.
మళ్లీ ధరలు తగ్గించేలా..
మండపేట నియోజకవర్గంలో రబీ ఆయకట్టు సుమారు 35,150 ఎకరాలు. ఇక్కడ వచ్చే దిగుబడి 1.18 లక్షల మెట్రిక్ టన్నులు. రైతుల అవసరాలకు పోను 1.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, ఒక మిల్లునకు వచ్చేది 1,247 మెట్రిక్ టన్నులు. జిల్లాలో వచ్చే దిగుబడి అంచనాలో మండపేట పోను 3.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని మిగిలిన 136 మిల్లులకు కేటాయిస్తే సగటున మిల్లుకు 2,897 మెట్రిక్ టన్నుల చొప్పున కేటాయించాల్సి ఉంది. గత రబీ కొనుగోలు విషయంలో జరిగిన గందరగోళం తెలిసిందే. ప్రభుత్వం కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామని, మిగిలింది రైతులు మిల్లులకు అమ్మకాలు తేల్చిచెప్పింది. తమకు కేటాయించిన సామర్థ్యం కన్నా అధికంగా కొనుగోలు చేయలేమంటూ మిల్లర్లు కనీస మద్దతు ధర కన్నా బస్తాకు రూ.150 నుంచి రూ.250 తగ్గించి కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లిపోవడంతో మిల్లర్లపై మరింత భారం పడుతోంది. ఇదే అదునుగా చూసి వారు ధరలు తగ్గిస్తే నష్టపోతామని రైతులు భయపడుతున్నారు. జిల్లాల పునర్విభజన రైతులకు మూలిగే నక్కపై తాటి పండు పడినట్టయ్యింది. ఇటు జిల్లా ఆదాయానికి కూడా భారీగా గండిపడనుంది.
రాజకీయ ఒత్తిడికి తలొగ్గి..
మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఒత్తిడి మేరకే చంద్రబాబు సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని పలువురు అంటున్నారు. దీనివల్ల మండపేటకు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం దగ్గర అవుతుందని వారి వాదన. అయితే ఈ విభజన వల్ల రైతులు ఇబ్బంది పడతారన్న విషయాన్ని ఆలోచించకపోవడం శోచనీయం.
ఫ ‘తూర్పు’లోకి మండపేట
నియోజకవర్గం
ఫ రాజకీయ ఒత్తిడితో నిర్ణయం
ఫ జిల్లా నుంచి తరలనున్న
85 రైస్ మిల్లులు
ఫ ధాన్యం విక్రయాలకు
తప్పని ఇబ్బందులు
ఫ నష్టపోతామని అన్నదాతల ఆవేదన
ధాన్యం సేకరణకు ఇబ్బంది
మండపేటలో రైస్ మిల్లులు సామర్థ్యంలో చాలా పెద్దవి. అందుకే ఉమ్మడి జిల్లాలో కాకినాడ, అనపర్తి, రాజమహేంద్రవరం, అమలాపురం పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన ధాన్యంలో 40 శాతం మండపేట నియోజకవర్గం పరిధిలోని మిల్లులకే వస్తోంది. జిల్లా ఏర్పడిన తర్వాత కూడా అమలాపురం, రామచంద్రపురం, రాజోలు పరిసర ప్రాంతాల నుంచి ధాన్యం ఎక్కువగా ఇక్కడి మిల్లులకు వస్తోంది. ఇప్పుడు మండపేట నియోజకవర్గం జిల్లా నుంచి వెళ్లిపోతే మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ధాన్యం సేకరణకు ఇబ్బంది అవుతోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో కలపడం దారుణం.
– కొవ్వూరి త్రినాథరెడ్డి, వైఎస్సార్ సీపీ
రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కొనేవారు లేక కష్టాలు
ఖరీఫ్ పంట వర్షాలతో దెబ్బతిని దిగుబడి రావడం లేదు. కానీ రబీ పంట బాగా పండినప్పుడు ధాన్యం కొనుగోలు సరిగా జరగక నష్టపోతున్నాం. జిల్లాలో మండపేట లేకపోతే ధాన్యం కొనేవారే లేకుండా పోతారు. ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
– చంటి, రైతు, కేశనకుర్రు, ఐ.పోలవరం మండలం
ఇక మిలిగింది కొనుగోడు
ఇక మిలిగింది కొనుగోడు
ఇక మిలిగింది కొనుగోడు


