యుద్ధం చేద్దాం.. తరిమేద్దాం
కొత్తపేట: జిల్లాలో ఎయిడ్స్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. పలువురి జీవితాలను కబళిస్తోంది. అవగాహన లోపంతో అనేక మంది ఎయిడ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వ్యాధి కంటే ముందు భయమే బాధితులను కుంగదీస్తోంది.. ప్రాణాల మీదకు తెస్తుంది.. అలాంటి భయాన్ని వీడితే హెచ్‌ఐవీని ఎదుర్కోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాధితులకు ఎన్నో వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. వారి జీవిత కాలాన్ని పెంచుతున్నాయి. అయితే వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ‘హ్యూమన్ ఇమ్యూనో డెఫిషెన్సీ సిండ్రోమ్’ను హెచ్‌ఐవీ అంటారు. మానవుడిలో రోగ నిరోధక శక్తిని తగ్గించే ఒక రకమైన వైరస్ దీనికి కారణం. సురక్షితం కాని లైంగిక సంబంధాల ద్వారా ఇది సోకుతుంది. వైరస్ సోకిన వారి రక్తం ఇతరులకు ఎక్కించటం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకకుండా సంభోగ సమయంలో తప్పనిసరిగా కండోమ్ వాడాలి. అవసరమైన ప్రతిసారి కొత్త సూదులు, సిరంజులు, బ్లేడ్లు ఉపయోగించాలి. హెచ్‌ఐవీ సోకని వారి రక్తాన్ని మాత్రమే పరీక్షలు చేసి ఇతరులకు ఎక్కించాలి. జిల్లాలో ఐసీటీసీల ద్వారా 6,825 మందిని హెచ్‌ఐవీ బాధితులను గుర్తించగా, వారు ఏఆర్‌టీ మందులు వాడుతున్నారు. జిల్లాలో సంచార హెచ్‌ఐవీ పరీక్ష వ్యాన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని నవంబర్ 4న అమలాపురం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ప్రారంభించారు. ఈ వ్యాన్‌లో సిబ్బంది జిల్లా అంతటా పర్యటిస్తూ వ్యాధిగ్రస్తుల రక్త నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఇందులో హెచ్‌ఐవీ పాజిటివ్ రోగులను ఐసీటీసీ సెంటర్లకు పంపించి, ఏఆర్‌టీ మందులు వాడిస్తున్నారు.
0000669853-000001-VJA ADSALES SPO
10.00x8.00
VJA ADSALES SPOT PAYMENT ACCOUNT
ఫ అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ
ఫ జిల్లాలో 6,825 మంది బాధితులు
ఫ నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం
గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన
హెచ్‌ఐవీ ఎయిడ్స్ నివారణకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రజలకు, జిల్లాలోని కళాశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు రెడ్ రిబ్బన్ క్లబ్ ఏర్పాటు చేసి తద్వారా హెచ్‌ఐవీవీ ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తున్నాం. లింక్ వర్కర్స్ ద్వారా 47 హైరిస్క్ గ్రామాలకు గుర్తించి హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ కోసం చికిత్స, సేవల సద్వినియోగం గురించి వివరిస్తున్నాం.
–భరతలక్ష్మి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ, ఎయిడ్స్
అండ్ టీబీ నివారణ అధికారి, అమలాపురం
యుద్ధం చేద్దాం.. తరిమేద్దాం


