ఉపాధ్యాయుడికి జాతీయ పురస్కారం
ఉప్పలగుప్తం: మండలంలోని చినగాడవల్లి మండల ప్రజా పరిషత్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు అంకం చంద్రసూర్యం ఆదివారం నేషనల్ ఇన్‌స్పిరేషన్ టీచర్ అవార్డు అందుకున్నారు. ఈ విషయాన్ని చంద్రసూర్యం విలేకరులకు తెలిపారు. అంతర్జాతీయ టీచర్స్ డే సెలబ్రేషన్స్‌ను పురస్కరించుకుని హైదరాబాద్‌కు చెందిన శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ 2025 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు వివరించారు. విద్యా బోధనలో వినూత్న విధానాలు, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడంతో ఈ అవార్డుకు ఎంపిక చేసిందన్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ల చేతుల మీదుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత పట్నం కమల మనోహర్ అవార్డును అందజేశారన్నారు. చంద్రసూర్యంను మండల విద్యాశాఖాధికారులు ఎన్‌వీ శంకరరావు, ఎస్.సత్యకృష్ణ, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.


