
నాలుగేళ్లుగా నాట్లే లేవు
అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో సుమారు 70 ఎకరాల ఆయకట్టు ఉంది. బెండ కాలువ సాగునీరు రాకపోవడంతో పంచనది మురుగునీటి కాలువ నుంచి ఉప్పునీరు ఎగదన్ని పంట పొలాల్లోకి చేరుతుంది. దీనివల్ల నాలుగేళ్లుగా ఇక్కడ వరి నాట్లు వేయలేదు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు రైతులు పలుసార్లు ఫిర్యాదు చేసినా నేటికీ పరిష్కారం కాలేదు.
● ఇదే మండలం కొమరిగిరిపట్నంలో 50 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ ఐదేళ్లుగా ఖరీఫ్ లేదు. ఇటీవల కాలంలో రబీ కూడా ఉండడం లేదు. పంట పొలాల దిగువన ఉన్న ఆక్వా చెరువుల నుంచి ఉప్పు నీరు ఎదురెక్కడంతో నాట్లు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు సాగు వదిలేశారు. ఇప్పుడు ఖరీఫ్ సాగు చేద్దామన్నా నారుమడులు, నాట్లు వేసే పరిస్థితి లేదు.
భూమున్న పేదోళ్లం అయ్యాం
కొమరగిరిపట్నంలో మూడు ఎకరాల్లో సాగు చేసేవాడిని. ఇప్పుడు భూమి ఉన్నా సాగుకు పనికి రాకుండా పోయాయి. మురుగునీరు దిగే అవకాశం లేక విలువైన భూములు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. మేమిప్పుడు భూమున్న పేదోళ్లం అయ్యాం.
– ఉండ్రాజవరపు యేసు, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం
అల్లవరం మండలం మొగళ్లమూరులో
సాగుకు పనికిరాని వరి చేలు

నాలుగేళ్లుగా నాట్లే లేవు