
పంట.. వేసేది లేదంట
కాట్రేనికోన మండలంలో రైతులకు ఏ టా తొలకరి సాగు చే యడం జూదంగా మారింది. విపత్తుల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు సాగు చేద్దామన్నా ఈ ఏడాది సాగునీరు సకాలంలో విడుదల చేయలేదు. ఆలస్యంగానైనా సాగు మొదలు పెడదామనుకుంటే కూనవరం స్ట్రె యిట్ కట్ ద్వారా సముద్రం నీరు నేరుగా పంట చేలకు చేరడంతో భూములు చవుడు బారిపోతున్నాయి. దీంతో పంట వేసే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
అన్నీ సమస్యలే..
తొలకరి పంటకు ఈ ఏడాది సాగునీరు ఆలస్యమైంది. చాలా మంది రైతులు సాగుకు దూరంగా ఉండనున్నారు. ఇదొక్కటే కాదు. అన్నీ సమస్యలే. ముంపు వెతలు, కూలీల కొరత వేధి స్తుంది. కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారే కాని, వ్యవసాయ పనులంటే ముందుకు రావడం లేదు. చాలా మంది రైతులు సాగు వదిలేయడానికి ఇదొక కారణం.
– వెర్రిబాబు, కాట్రేనికోన
కాలువల వ్యవస్థ... అవస్థ
ఆక్వా సాగు రాజోలు దీవిలో వరి సాగుకు ఉరివేస్తోంది. మురు గునీటి కాలువల వ్య వస్థ అధ్వానంగా ఉండడానికి తోడు ఆక్వా చెరువుల నుంచి వ్య ర్థాలు కాలువల్లోకి తోడేస్తున్నారు. దీనివల్ల మురుగునీటి కాలువల్లో పూడిక పేరుకుపోయి చేల నుంచి ముంపునీరు దిగడం లేదు. అలాగే ఆక్వా చెరువుల నుంచి నీరు చేలల్లోకి వస్తుండడంతో రైతులు సాగు చేయలేని పరిస్థితి వచ్చింది. దీనివల్ల సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు మండలాల్లోని శివారు ప్రాంతాల్లో రైతులు తొలకరి సాగుకు దూరమయ్యారు. మురుగునీటి కాలువ వ్యవస్థ అధ్వానంగా ఉన్నంత కాలం సాగు చేయలేమని చెబుతున్నారు.
ఆక్వా వ్యర్థాలన్నీ కలిసి..
మా చేలను చూస్తే నారు వేసే ధైర్యం రావడం లేదు. పంట, మురుగునీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. రొయ్యల చెరువుల వల్ల ఉప్పునీరు చేరడంతో నాట్లు వేసినా దెబ్బతింటున్నాయి. తొలకరి పంటను రైతులంతా దాదాపు మర్చిపోయారు.
– దొడ్డా రాంబాబు, రైతు, గొంది, సఖినేటిపల్లి మండలం

పంట.. వేసేది లేదంట

పంట.. వేసేది లేదంట

పంట.. వేసేది లేదంట