
భక్తిశ్రద్ధలతో మొహర్రం
మామిడికుదురు: పవిత్ర కర్భలా పుణ్యభూమిలో అశువులు బాసిన హజరత్ ఇమామ్ హుస్సేన్ అతని పరివారానికి ముస్లింలు రక్తం చిందిస్తూ నివాళులర్పించారు. మొహర్రంలో భాగంగా ఆదివారం నగరంలో పీర్లు, గుమ్మటాలను ఊరేగించారు. హుస్సేన్ అని నినదిస్తూ బ్లేడులు, కత్తులు, గొలుసులతో శరీరాలను గాయపర్చుకుంటూ రక్తం చిందించారు. గుండెలు బాదుకుంటూ మాతం చేశారు. నగరం పంజా నుంచి పంజీషా వరకూ జరిగిన ఊరేగింపులో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గుమ్మటాలను దర్శించుకున్నారు.