
జగన్‌ను కలిసిన శిరీష్
అమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదటి శిరీష్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. శిరీష్ తండ్రి దివంగత మిండగుదటి మోహన్ పార్టీ జిల్లా నేతగా ఆది నుంచి కరోనా వరకూ సేవలు అందించారు. అప్పట్లో జగన్‌ను కలిసినప్పుడు తీసిన ఫొటోను చూపించారు. అప్పుడు జగన్ ఆ ఫొటోపై తన ఆటోగ్రాఫ్ ఇచ్చారని శిరీష్ చెప్పారు.
వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల
పరిశీలకుల నియామకం
రావులపాలెం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు పరిశీలకులను నియమించినట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి గురువారం తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని జగ్గిరెడ్డి స్వగృహంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన పరిశీలకుతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఉన్న క్యూఆర్ కోడ్ ప్రతాలను వారికి అందజేశారు. వాటితో చంద్రబాబు ఇచ్చిన మోసపు హామీలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పరిశీలకులను నియమించి వారి విధివిధానాలను క్లుప్తంగా వివరించారు. మండపేట నియోజకవర్గానికి పరిశీలకులుగా కటకంశెట్టి ఆదిత్య, రామచంద్రపురం – కుడిపూడి శ్రీనివాసరావు, ముమ్మిడివరం – మాత మురళి, అమలాపురం – పేరి శ్రీనివాస కామేశ్వరరావు, పి.గన్నవరం – పెన్మత్స చిన్న భద్రరాజు, రాజోలు– వంటెద్దు వెంకన్ననాయుడు, కొత్తపేట – సిరిపురపు శ్రీనివాసరావును నియమించినట్టు తెలిపారు.
ధనిక, పేద తారతమ్యం తగ్గాలి
అమలాపురం రూరల్: ప్రైవేట్ పీపుల్స్ ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా ధనిక, పేదల మధ్య తారతమ్యం తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. వివిధ జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. జేసీ టీ. నిశాంతి, డీఆర్‌ఓ రాజకుమారి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

జగన్‌ను కలిసిన శిరీష్