
ఏం సాధించారని సుపరిపాలన?
ఏడాది పాలనలో అంతా దగాయే. ఏం సాధించారని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో కార్యక్రమాలు చేపడుతోంది? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే, సుపరిపాలన పేరుతో ప్రజలందరూ స్వాగతించేవారు. ఇప్పుడు ప్రజలే తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి. గుడి, బడి తేడా లేకుండా మద్యం షాపులు ఇష్టారాజ్యంగా పెట్టారనా..? గల్లీగల్లీకి బెల్ట్ షాపులు పెట్టారనా..?
– జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ పరిశీలకురాలు,
అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం
బాండ్లు పెద్ద బోగస్
గత ఎన్నికల్లో కూటమి పార్టీలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలతో ఇచ్చిన హామీలు, ఇవ్వబోయే పథకాలకు సంబంధించిన డబ్బుల మొత్తాలతో ఇంటింటికీ ప్రజలకిచ్చిన బాండ్లు ఓ పెద్ద బోగస్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు దిక్కు లేనప్పుడు ఇక ఆ బాండ్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకపోవడంతో వాటిని మూలన పడేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏదోలా అధికారం చేజిక్కించుకునేందుకు వల్ల కాని హామీలు ఇచ్చారు. ఇదే బాండ్ల బాగోతం.
– బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ
జగన్ పాలనలో అంబేడ్కర్ రాజ్యాంగం
డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే జగన్ పాలనలో అమలైతే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు తనయుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. తండ్రీకొడుకులు బాబు, లోకేష్‌లే కాకుండా, పవన్‌కల్యాణ్ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు కాని హామీలను మభ్యపెట్టి సుపరిపాలన అంటూ కొత్త నాటకాన్ని ప్రారంభించి గ్రామాల్లోకి వెళుతున్నారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు.
– గొల్లపల్లి సూర్యారావు, పార్టీ కో–ఆర్డినేటర్, రాజోలు నియోజకవర్గం
రైతులను వంచించిన ప్రభుత్వం మనజాలదు
ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన వరి పంటకు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ డబ్బులు వేయలేదు. ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దాదాపు 100 రోజులైనా డబ్బులు వేయకుండా అన్నదాతలను అవస్థలపాలు చేసింది. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం మనజాలదని గతంలోని చంద్రబాబు ప్రభుత్వాల చరిత్రలే చెబుతున్నాయి.
– డాక్టర్ పినిపే శ్రీకాంత్, పార్టీ కో–ఆర్డినేటర్, అమలాపురం నియోజకవర్గం
గడప గడపకూ వెళ్లి మోసాలను ఎండగడదాం
ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాలను మనం గడప గడపకూ వెళ్లి ఎండగడదాం. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు అప్పులు సృష్టిస్తున్నారు. మాట్లాడితే అబద్ధాలు, వంచనలు. వీటితోనే పాలన సాగుతోంది. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పోరాటాలు చేయాల్సి ఉంది. అందుకు మనమంతా కార్యసాధకులై సిద్ధమవుదాం.
– పిల్లి సూర్యప్రకాష్,
పార్టీ కో–ఆర్డినేటర్, రామచంద్రపురం నియోజకవర్గం
జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం
జిల్లా ప్రజలు జగన్ అంటే ఓ నమ్మకం అని ఇప్పుడు కూటమి పాలన చూశాక తెలుసుకున్నారు. చంద్రబాబు అంటే ఓ మోసం అని ఇప్పుడు అమలు చేయలేని హామీలు చూసి వారి నమ్మకం బలపడింది. జగన్ చేసేదే చెబుతాడు. బాబు చేయలేని పనులు కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేయడంలో మొనగాడు. అందుకే ప్రజలు నేడు జగన్‌ను మళ్లీ సీఎం చేయాలన్న తలంపుతో చంద్రబాబు మోసాలను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.
– గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ కో–ఆర్డినేటర్, పి.గన్నవరం నియోజకవర్గం

ఏం సాధించారని సుపరిపాలన?

ఏం సాధించారని సుపరిపాలన?

ఏం సాధించారని సుపరిపాలన?

ఏం సాధించారని సుపరిపాలన?

ఏం సాధించారని సుపరిపాలన?