
అన్ని రంగాల్లో మహిళల విజయబావుటా
అమలాపురం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో విజయబావుటా ఎగురవేస్తున్నారని ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి వద్ద శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజా కుమారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది నాణ్యమైన జీవితానికి దారితీసే అన్ని రంగాల నిర్ణయాత్మక ప్రక్రియలో మహిళల భాగస్వామ్య శక్తిని సూచిస్తుందన్నారు. జిల్లా అధ్యక్షురాలు గిరిజా కుమారి మాట్లాడుతూ ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కులను తెలిపేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించామన్నారు. ఎమ్మెల్సీలు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ మహిళా నాయకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, ఎంపీపీలు కుడిపూడి భాగ్యలక్ష్మి, దంగేటి అచ్యుత జానకి, జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, గెడ్డం సంపద రావు, పట్టణ అధ్యక్షుడు సంసాని బుల్లినాని, ఉప్పలగుప్తం మండల అధ్యక్షుడు బద్రి బాబ్జీ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరు వెంకటేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, హ్యాండి క్రాఫ్ట్ మాజీ డైరెక్టర్ ఉండ్రు బేబీ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతతోనే అభివృద్ధి
అమలాపురం రూరల్: మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో శనివారం జిల్లా స్థాయి మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళలు కీలక పాత్ర పోషించారనడం అతిశయోక్తి లేదన్నారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జేసీ టి.నిషాంతి, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో కె.మాధవి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు,
ఇజ్రాయిల్
ఘనంగా మహిళా దినోత్సవం

అన్ని రంగాల్లో మహిళల విజయబావుటా