డ్రగ్స్ రాకెట్ కలకలం: కాలేజీ స్టూడెంట్స్‌, టెక్కీలే టార్గెట్‌ | Rs 6 crore worth drugs seized from Bengaluru apartment | Sakshi
Sakshi News home page

భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు: స్టూడెంట్స్‌, టెక్కీలే టార్గెట్‌

Aug 7 2021 8:22 AM | Updated on Aug 7 2021 11:30 AM

Rs 6 crore worth drugs seized from Bengaluru apartment - Sakshi

కర్ణాటకలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ వెలుగు చూసింది. రూ.6 కోట్ల విలువైన 15 కిలోల ఆశీశ్‌ ఆయిల్, 11 కిలోల గంజాయి, 530 గ్రాముల సెరస్‌ ఉండలు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్‌ మీడియాకు తెలిపారు.

బనశంకరి: కర్ణాటకలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ వెలుగు చూసింది. బెంగళూరు సెంట్రల్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం బెంగళూరులోని హెణ్ణూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసి అస్సాంకు చెందిన ప్రముఖ డ్రగ్స్‌ పెడ్లర్‌ నబరన్‌చెక్మా, అతని అనుచరులు మోబీన్‌బాబు, రోలాండ్‌ రోడ్నిరోజర్, తరుణ్‌కుమార్‌ లాల్‌చంద్‌ను అరెస్ట్‌ చేశారు. రూ.6 కోట్ల విలువైన 15 కిలోల ఆశీశ్‌ ఆయిల్, 11 కిలోల గంజాయి, 530 గ్రాముల సెరస్‌ ఉండలు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్‌ మీడియాకు తెలిపారు.

రాష్ట్ర పోలీస్‌ చరిత్రలో 15 కిలోల ఆశీశ్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు. గత ఏడాది సీసీబీ యాంటీ డ్రగ్స్‌ పోలీసులు పక్కా సమాచారంతో బెంగళూరులోని రామమూర్తినగరలో దాడులు నిర్వహించి నబరన్‌చెక్మా అనుచరుడు సింటోథామస్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నబరన్‌చెక్మా తప్పించుకున్నాడు. అతని కోసం గాలిస్తుండగా హెణ్ణూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారంతో దాడులు నిర్వహించగా నబరన్‌చెక్మా గ్యాంగ్, అతని అనుచరులు పట్టుబడ్డారని నగర పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. నబరన్‌చెక్మా తన అనుచరులతో కలిసి కాలేజీ విద్యార్థులు, ఐటీ, బీటీ కంపెనీలకు చెందిన టెక్కీలకు ఆశీశ్‌ ఆయిల్, గంజాయిని విక్రయించేవాడని తెలిపారు.  (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్‌ షురూ, ఫోటో వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement