డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: అటానమస్ హోదాలో శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల డిగ్రీ మూడో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ విడుదల చేశారు. నవంబర్ 3వ తేదీ జరిగిన మూడో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు అతి త్వరగా విడుదల చేసేందుకు సహకరించి కళాశాల అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ పరీక్షల్లో 95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌న్స్ డాక్టర్ ఎ విద్యుల్లత, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి భద్రమణి, డాక్టర్ సి దివ్యవాణి, సూపరింటెండెంట్ శాంతి, ఎగ్జామినేషన్ సభ్యులు జి సుధాకర్, చంద్రశేఖర్, సంధ్య పాల్గొన్నారు.


