ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా నిలిచిన భారత్..!

India Pips USA To Become 2nd Largest Smartphone Market After China in 2022 - Sakshi

ఇదంతా స్మార్ట్ ఫోన్ యుగం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు పరిమితమైన ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్.. స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ మార్కెట్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ రావడమే ఆలస్యం.. వెంటనే కొనేందుకు యూజర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇండియా మొబైల్ మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ రాకతో చౌకైన ధరకే అందుబాటులోకి వచ్చేశాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉండటంతో యూజర్లు ఎగబడి కొనేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ మార్కెట్‌ను విస్తరించాయి. ఇండియాలో కూడా చైనా కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ కావడంతో స్మార్ట్ వినియోగదారుల్లో మరింత ఆసక్తిని పెంచింది. సరికొత్త ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. న్యూస్ జూ రిపోర్టు ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ అవతరించింది. చైనా స్మార్ట్ ఫోన్ల పుణ్యమ అని అమెరికాను స్టేట్స్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఇండియా వెనక్కి నెట్టేసింది. చైనా తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో గ్లోబల్ లీడర్'గా నంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలవగా, తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది.

మనదేశంలో 493 మిలియన్ల్ మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నట్లు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ తన ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ సంఖ్య అమెరికా స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పోలిస్తే 2రేట్లు ఎక్కువ, బ్రెజిల్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పోలిస్తే 4 రేట్లు, రష్యా స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పోలిస్తే 5 రేట్లు, జపాన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పోలిస్తే 6 రేట్లు ఎక్కువ. 

(చదవండి: 2020-21లో పసిడికి తగ్గిన డిమాండ్..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top