
ఊరు శివారే ఆవాసం !
మణుగూరు టౌన్: వానాకాలం వస్తే మణుగూరులోని చెత్త డంపింగ్ యార్డుకు వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో చెత్త డంప్ చేసేందుకు పట్టణ శివారే దిక్కవుతోంది. పట్టణం నుంచి రోజుకు సుమారు 17 టన్నుల చెత్తను వాహనాల ద్వారా తరలిస్తారు. వర్షం పడితే డంప్‌యార్డ్ దారంతా బురదమయం అవుతుంది. రోడ్డు పక్కనే చెత్త పడేస్తుండడంతో పందులు స్వైర విహారం చేస్తుండగా దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతూ దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దుర్వాసన భరించలేకపోతున్నామని, ఈగలు, దోమలతో వ్యాధులు ప్రబలుతున్నాయని యార్డ్‌కు సమీపంలోని బెస్తగూడెం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. డంప్‌యార్డ్‌ను మరో చోటకు మార్చాలంటున్నారు.
ఇంట్లో ఉండలేకపోతున్నాం
దోమలు, ఈగలతో నిత్యం చస్తున్నాం. వానాకాలం వచ్చిందంటే రోడ్డు బాగా లేదంటూ చెత్త బండ్లను ఇటే తీసుకొస్తున్నారు. చెత్త నుంచి వచ్చే దుర్గంధంతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం. దోమలతో సతమతం అవుతున్నాం.
– మర్రి వెంకటనర్సమ్మ, బెస్తగూడెం
●

ఊరు శివారే ఆవాసం !