
● మోడు కాదు తోడు!
ఈ చిత్రాన్ని చూడగానే వ్యవసాయ క్షేత్రంలో అలంకరణ కోసం పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి కదా! అశ్వారావుపేటలోని నందమూరినగర్ నుంచి పేటమాలపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఓ రైతుకు వ్యవసాయ క్షేత్రం ఉంది. కొన్నేళ్లు సాగులో ఉన్న కొబ్బరి తోట ముదిరిపోగా దీన్ని తొలగించే క్రమాన వృక్షాల మోడులను అలాగే వదిలేశారు. వీటి మధ్య ప్రస్తుతం అరటి పంట సాగు చేస్తున్నారు. భవిష్యత్‌లో పందిరి, తీగ జాతుల తోటలు సాగు చేస్తే ఈ మోడులు ఆలంబనగా నిలుస్తాయని అలాగే వదిలేసినట్లు తెలుస్తోంది. – అశ్వారావుపేట రూరల్