
‘కరెంట్’కే కష్టాలు!
వాతావరణ ం
జిల్లాలో సోమవారం ఆకాశం మేఘావృతంగా మారుతుంది. సాయంత్రం వరకు అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది.
● జిల్లా విద్యుత్‌శాఖలో పేరుకుపోయిన మొండి బకాయిలు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెండింగ్ కరెంట్ బిల్లులు ● హెచ్‌టీ బకాయిలు రూ.404 కోట్లు, ఎల్‌టీలో రూ. 62 కోట్లు ● ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్న అధికారులు
భారం
సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యుత్ శాఖలో బకాయిలు పేరుకుపోతున్నాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌శాఖకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. వాటి నుంచి గట్టెక్కేందుకు బ్యాంకు రుణాలవైపు చూస్తోంది. బకాయిలు చెల్లించాల్సిన జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలతోపాటు కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో గత ఏప్రిల్ వరకు హెచ్‌టీ(హై టెన్షన్) కనెక్షన్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.404.58 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎల్‌టీ(లో టెన్షన్) కనెక్షన్లకు సంబంధించి రూ.62.06 కోట్ల వరకు బకాయి ఉండటం గమనార్హం. అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ శాఖ నుంచి 25 సర్వీసులకు రూ. 310.72 కోట్ల బకాయి ఉంది. మున్సిపల్ (డబ్ల్యూడబ్ల్యూ) శాఖలో 7 కనెక్షన్ల నుంచి రూ.23.87 కోట్లు, ఇరిగేషన్ శాఖలో 28 సర్వీసులకు సంబంధించి రూ.45.22 కోట్ల బకాయిలు ఉన్నాయి.
బకాయిల
ఎల్‌టీ కనెక్షన్ల బకాయిల వివరాలు ఇలా..
డిపార్ట్‌మెంట్ సర్వీసుల బకాయి
సంఖ్య (రూ.లక్షల్లో)
సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్
బ్యాంకులు 15 1.86
ఆర్‌డబ్ల్యూఎస్ 11 67.56
పోస్టల్ 9 0.21
ఎఫ్‌సీఐ 2 0.20
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ బకాయి ఉన్నవి
మైనర్ పంచాయతీ
(డబ్ల్యూడబ్ల్యూ) 1,475 1935.62
మైనర్ పంచాయత్
(ఎస్‌టీఎల్) 2,574 1452.36
మేజర్(డబ్ల్యూడబ్ల్యూ) 104 185.63
మేజర్(ఎస్‌టీఎల్) 422 130.06
మున్సిపల్(ఎస్‌టీఎల్) 563 290.01
మున్సిపల్(డబ్ల్యూబ్ల్యూ) 137 242.25
ఎడ్యుకేషన్ 204 212.44
ఫిషరీస్ 85 162.68
సోషల్ వెల్ఫేర్ 718 415.47