
●ముందుకు సాగలేక.. వెనక్కి వెళ్లలేక
ఖమ్మం బైపాస్ రోడ్డులో శనివారం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వాహనాలు మెల్లగా కదులుతుండడంతో తెలంగాణ తల్లి సర్కిల్ నుంచి చైన్నె షాపింగ్‌మాల్ వరకు మూడు గంటల పాటు బారులుదీరాయి. పోలీసులు చేరుకున్నప్పటికీ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి శ్రమించాల్సి వచ్చింది. తెలంగాణ తల్లి సర్కిల్ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం.. ట్రాఫిక్ స్నిగల్ గ్రీన్ లైట్ సమయం తక్కువగా ఇస్తుండగా.. ఐదారు భారీ వాహనాలు మూల తిరిగి వెళ్లేలోగా రెడ్ లైట్ పడుతోంది. శనివారం కూడా ఇదే సమస్యతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని లారీల డ్రైవర్లు వాపోయారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్

●ముందుకు సాగలేక.. వెనక్కి వెళ్లలేక