
ప్రాణాలు తీస్తున్నాయ్..
వీధి కుక్కలు.. వానర మూకలు
● కుక్కకాటుతో ఇద్దరు చిన్నారుల మృతి ● కోతుల దాడిలో గాయపడ్డ ట్యాక్సీ డ్రైవర్ ● చికిత్స పొందేందుకు భారీగా ఖర్చు ● నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్న ప్రజలు
జిల్లా కేంద్రంలో సమస్య తీవ్రం..
జిల్లావ్యాప్తంగా కోతులు, కుక్కలు బీభత్సం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వివిధ పనులకు నిమిత్తం బయటకు వెళ్లివచ్చేవారి పై కుక్కలు ఎగబడి దాడి చేస్తున్నాయి. ద్విచక్రవా హనాలపై వెళ్లే వారిని కూడా తరమడంతో కిందపడి గాయపడుతున్నారు. ఇక తలుపు తెరచి ఉంటే చాలు కన్నుమూసి తెరిచేలోపు ఇంట్లో ఆహార పదా ర్థాలను కోతులు ఎత్తుకుపోతున్నాయి. వెళ్లగొడుతుంటే ఎగబడుతున్నాయి. రక్షించుకునే క్రమంలో పలువురు కిందపడి గాయపడుతున్నారు. ఈ సమస్య పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా ఉంది. జిల్లా కేంద్రంలోని రామవరం తదితర ప్రాంతాల్లో మరింత తీవ్రంగా ఉంది.