బాపట్ల
న్యూస్‌రీల్
ఎగుమతులు పెరిగాయి
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
త్రికోటేశ్వరుడి సేవలో నటుడు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం మంగళవారం దర్శించుకున్నారు. తర్వాత ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
భగవద్గీత ఆవిర్భావ వేడుకలు
నాదెండ్ల: సాతులూరు రెడ్డి పేరంటాలమ్మ ఆలయం వద్ద మంగళవారం భగవద్గీత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చాలాకాలం తరువాత మళ్లీ రొయ్య మీసం మెలేసింది.
రొయ్యల ధరలు పైకి ఎగబాకుతున్నాయి. రోజురోజుకు ఽటైగర్ రకం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. వనామా రొయ్యల ధరలు దిగజారాయి.
మీసం మెలేసిన
వేటపాలెం: అమెరికా సుంకాల ధాటికి ఆక్వా పరిశ్రమ ఎగుమతులు లేక కుదేలైంది. భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా గల్ఫ్ దేశాలకు ఆక్వా ఎగుమతులు ప్రారంభించింది. దీంతో రైతులు కొంత మేర కోలుకున్నారు. టైగర్ రొయ్యల ధరలు గణనీయంగా పెరగడంతో జిల్లాలోని ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి..
బాపట్ల జిల్లా వ్యాప్తంగా 22 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి చీరాల, వేటపాలెం, చిన్నగంజాం మండలాల పరిధిలో ఐదు వేల ఎకరాల్లో సాగైంది. టైగర్ రొయ్యలు 3 వేలు, వనామా రొయ్యలు 2 వేల ఎకరాల్లో ప్రస్తుతం దిగుబడి దశలో ఉన్నాయి. తుఫాన్‌ల కారణంగా నాలుగు రోజుల నుంచి అక్వా సాగుపై లిబ్రియో, వైట్ స్పాంట్ వైరస్‌లు దాడి చేస్తున్నాయి. రైతులు తమ పంటలను త్వరగా విక్రయించుకోవడానికి చూస్తున్నారు. టైగర్ రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, వనామా రొయ్యల ధరలు చతికిలపడ్డాయి. ఐదేళ్లలో ఆక్వా రైతులు పంటలు సరిగా పండక తరచూ తెగుళ్లు, ధరలు పతనం వంటి వాటితో రైతులు నష్టాల పాలయ్యారు.
ఎందుకు పెరిగాయంటే..
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న రొయ్యల సాగు వరుస నష్టాలతో కూనారిల్లింది. వైట్‌కట్, విబ్రియా, తెల్లమచ్చల వంటి వైరస్‌లతో ఆక్వా రైతులు దివాలా దిశగా వెళ్లారు. దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అమెరికా సుంకాల విధింపుతో ఎగుమతులు నిలిచిపోయాయి. ధరలు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యామ్నాయంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఊపందుకున్నాయి. చైనా వంటి దేశాలు రొయ్యల ఉత్పత్తుల దిగుమతి చేసుకుంటున్నాయి.
రొయ్యల చెరువులు
(ధర రూ.లలో)
కౌంట్
20 650 –––
30 510 445
40 400 380
50 380 350
60 340 330
70 320 310
80 300 260
100 280 250
టైగర్ వనామా
1
ప్రస్తుతం రొయ్యల ఎగుమతులు పెరిగాయి. గల్ఫ్, చైనా దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. వాతావారణం చల్లగా ఉండటంతో రొయ్యలకు లిబ్రియా, వైట్ స్పాంట్ వంటి వ్యాధులు వస్తున్నాయి. తిరిగి ఎండలు వస్తే కొంతవరకు కొలుకుంటాయి.
– సురేష్, జేడీ, ఫిషరీష్, బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


