మట్టికి కూడా సీనరేజ్ చెల్లించాలా?
బల్లికురవ: సొంత పొలంలో నుంచి ఇంటి మెరక కోసం మట్టి తోలుకుంటుంటే సీనరేజ్ చెల్లించాలంటూ ట్రాక్టర్ ఆపడం విడ్డూరంగా ఉందని నాలుగు గ్రామాల రైతులు నిరన వ్యక్తం చేశారు. మంగళవారం బల్లికురవ నాలుగు రోడ్ల కూడలి మీదుగా నక్కబొక్కలపాడు గ్రామానికి చెందిన రైతు ట్రాక్టర్‌లతో మట్టి తోలుతున్నాడు. కూడలిలోని ఏఎంఆర్ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది ట్రాక్టర్‌లను ఆపి సీనరేజ్ చెల్లించాలని ప్రశ్నించారు. సొంత పొలంలో నుంచి తోలుకునే మట్టికి సీనరేజ్ చెల్లించాలా అని ప్రశ్నించారు. అదేమీ కుదరదని.. సీనరేజ్ చెల్లిస్తేనే ట్రాక్టర్‌లు కదలనిస్తామని హుకుం జారీ చేశారు. బల్లికురవ, నక్కబొక్కలపాడు కొత్తపాలెం, గుంటుపల్లి 4 గ్రామాలకు చెందిన 100 మంది వరకు రైతులంతా నిరసన వ్యక్తం చేశారు. సిబ్బంది సంస్థ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడి సీనరేజ్ నుంచి మినహాయించారు. రైతులు మాట్లాడుతూ ఇంటి నిర్మాణాలకు వాగులో నుంచి ఇసుక, వృథా సైజు రాళ్లు తొలుకునేవారమని చెక్ పోస్టుల పుణ్యమా అంటూ ఏమి తోలాలన్నా భయపడుతున్నాని ఇలంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణాలు ఎలా చేపట్టాలని రైతులు ప్రశ్నించారు.


