కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించాలి
కర్లపాలెం: తుఫాన్ ప్రమాదం పొంచి ఉన్నందున రైతులు కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే విక్రయించుకోవాలని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి అన్నపూర్ణ తెలిపారు. ఆదివారం వ్యవసాయాధికారులతో కలసి ఆమె తుమ్మలపల్లి గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. ఇప్పటికే ధాన్యం ఉన్న రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించాలని కోతలు కోయాల్సిన రైతులు తుఫాన్ ప్రభావం పోయిన తరువాత కోతలు చేపట్టాలని చెప్పారు. ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని రైతులకు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులకు కావలసిన గోనె సంచులు ఇస్తారని ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో ఏవో సుమంత్‌కుమార్, రైతులు ఉన్నారు.


