పది సవర్ల బంగారం చోరీ
మేదరమెట్ల: ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగలు తస్కరించిన సంఘటన కొరిశపాడు మండలం తిమ్మనపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. తిమ్మనపాలెం గ్రామానికి చెందిన యనుమల వెంకట రఘురామరెడ్డి తన భార్యతో కలిసి శనివారం ఇంటికి తాళాలు వేసి త్రోవగుంట వెళ్లి తిరిగి ఆదివారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి వెనుక ఉన్న తలుపులు పగులగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా ఇంట్లోని బీరువా కూడా పగులగొట్టి ఉంది. బీరువాలో ఉన్న పది సవర్ల బంగారం దొంగలు దోచుకుపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులకు సమాచాం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మేదరమెట్ల పోలీసులు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మహ్మద్‌రఫీ తెలిపారు.


