
బొద్దులూరుపాడులో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి మేరుగ నాగార్జున
మంత్రి మేరుగ నాగార్జున
కొల్లూరు : భక్తితో మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా గురువారం మండలంలోని బొద్దులూరుపాడులో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సర్వమత సౌభ్రాతృత్వంతో ప్రశాంత జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. యువత సంస్కృతి, సంప్రదాయాలకు విలువివ్వాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో అన్ని మతాలు కలిసి కట్టుగా పండగలు జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. తొలుత ఆయన స్థానిక రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచి గుర్రం మురళి, వైస్ ఎంపీపీ మురాల రాంబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు సూర్యదేవర రామకృష్ణ, నూతలపాటి వెంకటేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వరరావు, పట్టపు వెంకటేశ్వర్లు, పిచ్చయ్య, కొలుసు శ్రీనివాసరావు, అయిల సుబ్బారావు, ఉప్పు శ్రీనివాసరావు, ఈమని శంకర్ తదితరులు పాల్గొన్నారు.