మద్యం కేసులో ఎకై ్సజ్‌ లింకులు ! | - | Sakshi
Sakshi News home page

మద్యం కేసులో ఎకై ్సజ్‌ లింకులు !

Dec 3 2025 7:45 AM | Updated on Dec 3 2025 7:45 AM

మద్యం కేసులో ఎకై ్సజ్‌ లింకులు !

మద్యం కేసులో ఎకై ్సజ్‌ లింకులు !

మద్యం కేసులో ఎకై ్సజ్‌ లింకులు !

మదనపల్లె : ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు ఎకై ్సజ్‌ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటి దాకా ప్రభుత్వ స్థాయిలో ప్రకంపనలతో రాష్ట్ర రాజకీయాలను ఉలికిపాటుకు గురి చేసింది. ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు నిందితులకు సహకరించిన వారి చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడు ఎవరిపై వేటుపడుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎకై ్సజ్‌ శాఖ సిబ్బంది ఇందుకు సహకరించిన కారణంగానే.. వారి పాత్ర బహిర్గతమవుతోందని తీసుకుంటున్న చర్యలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. అక్టోబర్‌ మూడో తేదీ జరిగిన దాడుల్లో ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ ప్లాంట్‌ గుట్టు బహిర్గతమైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో గత ఎకై ్సజ్‌ సీఐ హిమబిందును తొలుత ఇక్కడి నుంచి బదిలీ చేయగా రెండో రోజుకే సస్పెండ్‌ చేశారు. ఈకేసులో ఇది మొదటి చర్యగా నిలిచింది.

అడ్డంగా దొరికిన భాస్కర్‌

2024 సెప్టెంబర్‌లో జరిగిన బదిలీల్లో కానిస్టేబుల్‌ భాస్కర్‌ ములకలచెరువు ఎకై ్సజ్‌ స్టేషన్‌ కు వచ్చాడు. మొదట నకిలీ మద్యం కేసులో సిబ్బంది పాత్రపై ఎలాంటి ఆధారాలు వెలుగు చూడలేదు. తాజాగా భాస్కర్‌ వ్యవహారంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సస్పెండ్‌ చేశారు. దీనికి ప్రధానంగా భాస్కర్‌.. ఈ కేసులో నిందితులైన వారితో ఫోన్లో మాట్లాడిన వివరాలను కాల్‌ రికార్డ్‌ డేటా ఆధారంగా గుర్తించారు. ఏ నిందితులతో.. ఎంతకాలంగా ఫోన్‌ కాంటాక్ట్‌లో ఉన్నాడు అన్నది నిగ్గు తేల్చినట్టు తెలిసింది. ఇతని పాత్ర ఉందని గుర్తించి సస్పెండ్‌ చేయగా ఇతన్ని అధికారులు విచారణ చేయనున్నారు. నిందితులతో ఎందుకు ఫోన్‌ కాంటాక్ట్‌లో ఉన్నాడు, వారితో ఏ వ్యవహారాలు నడిపాడు, నకిలీ మద్యం తయారీ, సరఫరా, బెల్టు షాపులకు విక్రయాలు ఇతర అంశాలపై ఇప్పటికే విచారణ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సస్పెండ్‌ చేయడంతో ఇక ఇతన్ని విచారణ చేసి మరిన్ని వివరాలను రాబట్టే అవకాశం ఉందని ఎకై ్సజ్‌ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. విచారణ తర్వాత వెలుగులోకి వచ్చే విషయాల ఆధారంగా కేసులో నిందితునిగా చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానంగా భాస్కర్‌ తనంతట తాను నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఉన్నాడా, లేక పై అధికారుల సూచన మేరకు చేశాడా, ఇది ఎంత కాలంగా జరిగింది, ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది.. అన్న విభిన్న కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భాస్కర్‌ నిందితులతో ఫోన్‌ సంభాషణలు జరపకుండా ఉంటే ఇతని పేరు వెలుగులోకి వచ్చి ఉండేది కాదు. ముఖ్యంగా ఇప్పటికే అరెస్ట్‌ అయిన నిందితులను అధికారులు కస్టడీ విచారణలు చేశారు. ఈ విచారణలో నిందితులు భాస్కర్‌ పేరుని వెల్లడించి ఉంటారని అనుమానాలు ఉన్నాయి. కాల్‌ డేటా ఆధారంగా భాస్కర్‌ను సస్పెండ్‌ చేసే అవకాశం వచ్చిందని చెప్తున్నారు. భాస్కర్‌ను విచారణ చేశాక మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆ నలుగురిపైనా విచారణ

జిల్లాలోని మదనపల్లి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎకై ్సజ్‌ స్టేషన్లో పని చేస్తున్న జి.మణి, ఎం.కిరణ్‌, ఎ.వినోద్‌ కుమార్‌, ఎం.నరేంద్రరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లలను చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అటాచ్‌ బదిలీలు ఇచ్చారు. ఇప్పుడు వీరి పాత్ర కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. నకిలీ మద్యం సరఫరా, బెల్ట్‌ షాపులకు తరలించే వ్యవహారాల్లో వీరి పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నలుగురిపై ఆరోపణ లు ఉన్నాయి.. విచారణలో ఉన్నారు.. కాబట్టి స్థానికంగా విధులు నిర్వహించకుండా ఇతర ప్రాంతాలకు అటాచ్‌ చేస్తూ బదిలీ ఇచ్చారని ఓ ఎకై ్సజ్‌ అధికారి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ నలుగురికి నకిలీ మద్యం వ్యవహారంలో ప్రమేయం ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ముఖ్యంగా నిందితుల విచారణ సమయంలో వీరి ప్రమేయాన్ని వెల్లడించారా అన్నది చర్చనీయాంశమైంది.

ఇటీవల ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

కర్ణాటక నుంచి అక్రమ మద్యం తరలింపు, బెల్టు షాపులకు విక్రయించిన వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఓ ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ను బి.కొత్తకోట పోలీసులు అరెస్టు చేశారు. ఇతన్ని సాంకేతిక ఆధారాలతో నిర్ధారించడం, అంతకుమునుపు ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంపై కీలకమైన దర్యాప్తు చేశారు. అంతా నిజమని తేలాక తంబళ్లపల్లె మండలానికి చెందిన ఆ ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌ అయ్యారు. ఇతనితోపాటు కొంత మంది ఎకై ్సజ్‌ కానిస్టేబుళ్లపై బెల్ట్‌ షాపుల మద్యం విక్రయాలతో సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఎకై ్సజ్‌ పోలీసుల పాత్ర వెలుగులోకి రావడం ఆ శాఖకు మచ్చ తెచ్చింది. నకిలీ మద్యాన్ని అరికట్టాల్సిన ఎకై ్సజ్‌ శాఖ సిబ్బంది దీనికి సహకరించినట్టు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.

మొదట్లోనే సీఐ హిమబిందు సస్పెన్షన్‌

ఇప్పుడు కానిస్టేబుల్‌ భాస్కర్‌

విచారణ అయ్యాక.. వీలైతే కేసు

పై అధికారులు చెబితే పాటించాడా.. స్వయంగా సహకరించాడా?

ఆ నలుగురు కూడా భాగస్వామ్యం

అయ్యారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement