కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ వార్షిక వివరాల స్లిప్‌లను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి కోరారు. ఈ విషయమై మంగళవారం కడప జెడ్పీలో డిప్యూటి సీఈఓ మైథిలిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2023–2024 సంవత్సరానికి చెందిన పీఎఫ్ స్లిప్‌లను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని, పీఎఫ్ నెలవారీ జమలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లో ఉంచాలని కోరారు.