Corona in AP: 9,996 New Cases and 82 Deaths Registered in Last 24hrs | ఏపీలో కొత్త‌గా 9,996 క‌రోనా కేసులు- Sakshi
Sakshi News home page

క‌రోనా: ఏపీలో కొత్త‌గా 9,996 కేసులు

Aug 13 2020 4:23 PM | Updated on Aug 13 2020 6:27 PM

Andhra Pradesh Reports New 9996 Coronavirus Positive Cases - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి:  గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌తిరోజూ ప‌ది వేల‌కు చేరువ‌లో కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 55,692 కోవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌గా 9,996 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది. రికార్డు స్థాయిలో ప‌రీక్ష‌లు చేస్తుండ‌టంతో కోవిడ్‌ ప‌రీక్ష‌ల సంఖ్య 27 ల‌క్ష‌లు దాటింది. ఈ నెల 13 నాటికి మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య‌ 27,05,459కు చేరుకుంది. (కరోనా కాదంటూ రోదించినా...)

తాజాగా 9,499 మంది క‌రోనాను జ‌యించి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం రిక‌వ‌రీ కేసుల కేసుల సంఖ్య 1,70,924గా ఉంది. క‌రోనా కార‌ణంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2378కు చేరుకుంది. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (ఏపీ: 9597 పాజిటివ్‌‌, 93 మంది మృతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement