● అక్రమంగా మట్టి తవ్వకాలు
● కన్నెత్తి చూడని అధికారులు
విడపనకల్లు: రోడ్డు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. మండల పరిధిలోని చీకలగురికి గ్రామంలో బూదగవి రోడ్డు క్రాస్ నుంచి చీకలగరికి వరకు నూతనంగా రూ.1.5 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.ఇందుకోసం రోడ్డు కాంట్రాక్టర్ గ్రామ సచివాలయం సమీపంతో పాటు జగనన్న లేఅవుట్‌కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో పెద్ద పెద్ద గుంతలు తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టమొచ్చినట్లు జేసీబీలను పెట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించినా అటు వైపు రెవెన్యూ,మైనింగ్ శాఖ అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, కాంట్రాక్టర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కాంట్రాక్టర్ మంత్రి పయ్యావుల కేశవ్ బంధువు.. అందుకే అతను ఏం చేసినా, ప్రజలకు ఇబ్బంది కలిగించినా పట్టించుకోవడం లేదు’ అని చర్చించుకుంటున్నారు.


