
ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాలేదని ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: ఎంసెట్‌లో అశించినస్థాయిలో ర్యాంకు రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థి సాగర్‌కుమార్‌రెడ్డి (17) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను జీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ నాగప్ప శనివారం మీడియాకు వెల్లడించారు. యల్లనూరు మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన వ్యవసాయదారుడైన పద్మభూషణ్‌రెడ్డి కుమారుడు సాగర్‌కుమార్‌రెడ్డి అనంతపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివాడు. ఇంటర్ తరువాత ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాకపోవడంతో లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు వెళ్లాడు. రెండోసారి రాసిన ఎంసెట్‌లోకూడా మంచి ర్యాంకు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఇంట్లోవారికి చెప్పకుండా తాడిపత్రికి మోటార్‌సైకిల్‌పై వచ్చాడు. చల్లవారిపల్లివద్ద మోటార్‌సైకిల్‌ను పార్క్ చేశానని, వచ్చి తీసుకెళ్లాలని ఇంట్లోవారికి సెల్‌ఫోన్‌లో మెసేజ్ పంపాడు. అనంతరం సాగర్‌కుమార్‌రెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాల కోసం ఆరా తీశారు. ఎలాంటి అచూకీ తెలియకపోవడంతో ఫొటోలను తీశామన్నారు. రైలు కింద పడిన యువకుడు తన కుమారుడని పద్మభూషణ్‌రెడ్డి సమాచారం ఇవ్వడంతో ఫిర్యాదు తీసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు.