
మెగా లోక్ అదాలత్‌లో 1076 కేసుల పరిష్కారం
చోడవరం : స్థానిక కోర్టుల సముదాయంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. 9వ ఏడీజే కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ కోర్టు, అదనపు సివిల్ జడ్జి కోర్టుల పరిధిలో పలు కేసులను పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్‌లో అన్ని విభాగాలకు చెందిన 1076 కేసులను పరిష్కరించారు. అత్యధికంగా ఎస్‌టీసీ కేసులు 946 పరిష్కరించారు. అనంతరం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి రత్నకుమార్ మాట్లాడుతూ చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి గౌరీశంకరరావు మాట్లాడుతూ చిన్ని చిన్న తగాదాలకు కోర్టులకు ఎక్కకుండా రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సూర్యకళ, చోడవరం, కె.కోటపాడు సీఐలు అప్పలరాజు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.