
నూకాంబిక సన్నిధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
అనకాపల్లి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ శుక్రవారం ఉత్తరాంధ్రుల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు స మర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కె.ఎల్.సుధారాణి అమ్మవారి చిత్రపటాన్ని మాధవ్‌కు అందజేశారు. అంతకుముందు గూడ్స్‌రోడ్డు లోని ఇంద్రద్యుమ్న హాల్లో జగన్నాథస్వామిని మాధవ్ దంపతులు దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పీలా నాగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.