
కూలిన హైస్కూల్ ప్రహరీ
కూలిన దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ
దేవరాపల్లి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోయింది. గోడను ఆనుకొని భారీగా మట్టి కుప్పలుగా వేయడంతో పాటు ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోడ కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక హైస్కూల్ ఆవరణలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహానికి సంబంధించిన మట్టిని ప్రహరీకి ఆనుకొని భారీ స్థాయిలో వేయడంతో గోడ బలహీనమై కూలిపోయిందని, ఇది ముమ్మా టికీ అధికార్ల నిర్లక్ష్యమేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. అధికార్లు తక్షణం స్పందించి ప్రహరీ పునఃనిర్మాణ పనులను చేపట్టాలని వారు కోరారు.