
రూ.1.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ
అనకాపల్లి: చోరీకి గురైన 625 సెల్‌ఫోన్లను పదో విడతలో రికవరీ చేశామని, వీటి విలువ సుమారు రూ.1.20 కోట్లు ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం రికవరీ చేసిన సెల్‌ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 5,600 ఫిర్యాదులు నమోదు కాగా.. 9 విడతల్లో 2,711 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. 10వ విడతతో కలిపి మొత్తం 3,336 మొబైల్ ఫోన్లను (రూ.5.27 కోట్ల విలువైన) రికవరీ చేశామన్నారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో ఫోన్లను కనుగొని రికవరీ కోసం జిల్లా పోలీసులతో ప్రత్యేకంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేశామశ్నారు. ఎఫ్‌ఐఆర్ లేకుండా, పోలీస్ స్టేషన్‌కు రాకుండా, మొబైల్ వివరాలను తెలియజేసి రికవరీ చేసే విధానాన్ని అమలు చేసి ప్రజలకు సౌలభ్యం కల్పించామన్నారు. ఫోన్ పోయిన వెంటనే సెల్ నంబర్ 93469 12007కు హాయ్ అని వాట్సప్ మెసేజ్ పంపి వచ్చే లింకు ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చన్నారు. www.ceir.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, సైబర్ సెల్–సోషల్ మీడియా సీఐ బెండి వెంకటరావు, ఎస్‌బీ సీఐలు బాల సూర్యారావు, లక్ష్మణమూర్తి, టి.లక్ష్మి, రమేష్, గఫూర్, ఐటీ కోర్ ఎస్‌ఐ బి.సురేష్ బాబు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

రూ.1.2 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ