
జిల్లా రెవెన్యూ సర్వీసెస్ భవనానికి భూమి పూజ
అనకాపల్లి: మండలంలో ఏఎంఎఎల్ కళాశాల జంక్షన్ సమీపంలో ఏపీ రెవెన్యూ జిల్లా సర్వీసెస్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి సోమవారం కలెక్టర్ విజయకృష్ణన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త జిల్లాగా ఏర్పడిన తరువాత అనకాపల్లిలో రెవెన్యూ శాఖకు భవనం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత చేరువ కావాలన్నారు. ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను మరింత బాధ్యతాయుతంగా పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖ కి మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు, అనకాపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.రాజేష్, ఏపీ వీఆర్‌వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంటి, ప్రధాన కార్యదర్శి జి.అనుపమ, ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ ఎస్.ఎస్.వి.నాయుడు, జిల్లా అధ్యక్షుడు రత్నం, జిల్లా కార్యదర్శి ఎలమంచిలి శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.