
24 గంటలూ జగన్నాథుని ఉచిత దర్శనం
ఇంద్రద్యమ్న హాల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత దర్శనం
అనకాపల్లి టౌన్: పట్టణంలోని గూడ్స్‌రోడ్ ఇంద్రద్యమ్న హాల్‌లో కొలువైన జగన్నాథ స్వామిని 24 గంటలూ ఉచిత దర్శనం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వామిని దర్శించుకొనేందుకు భక్తులకు ఉదయం గంట సేపు మాత్రమే అవకాశం కల్పించడంపై ‘సాక్షి’దినపత్రికలో ‘జగన్నాథుని ఉచిత దర్శనం గంటసేపే’అని ఆదివారం ప్రచురితమైన కథనానికి ఆలయ ఈవో బి.మురళీకృష్ణ స్పందించారు. 24 గంటలూ ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

24 గంటలూ జగన్నాథుని ఉచిత దర్శనం