
చిన అప్పనపాలెంలో ఆలయ హుండీల చోరీ
● నగదు, బంగారం, వెండి వస్తువులతో పరారీ
బుచ్చెయ్యపేట: మండలంలో చిన అప్పనపాలెంలో పైడితల్లమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. సోమవారం ఉదయం గుడికి వెళ్లిన భక్తులు ఇక్కడ తలుపులు తెరచి, హుండీలు లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అమ్మవారి మెడలో వస్తువులతోపాటు ఆలయంలో సీసీటీవీ హార్డ్ డిస్క్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పట్టుకుపోయారు. ఆలయంలో హుండీ, గర్భగుడిలో మరొక హుండీతోపాటు పంచలోహ విగ్రహానికి ధరించిన పావు తులం బంగారు మంగళసూత్రాలు, 10 తులాల వెండి తాడులు ఎత్తుకుపోయారు. అమ్మవారి మెడలో ఉన్న మరో 50 తులాల వెండి వస్తువులను తీసి పక్కన పడేశారు. పగులగొట్టిన ఒక హుండీని ఆలయం వెనకాల, మరో హుండీని, తాళాలను పంట పొలంలో పారేశారు. దీనిపై బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీంని రప్పించి విచారణ చేస్తున్నారు.

చిన అప్పనపాలెంలో ఆలయ హుండీల చోరీ