
పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నది
● ఎస్పీ తుహిన్‌సిన్హా
అనకాపల్లి: పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదైనా, సమాజ రక్షణ కోసం చూపిన నిబద్ధత, సమర్థత, సేవా భావం ప్రశంసనీయమని ఎస్పీ తుహిన్‌సిన్హా అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందిని సోమవారం తన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పోలీస్ శాఖలో 35 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తూ విశిష్ట సేవలందించారన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నారు. ఏదైనా సహాయం అవసరమైతే జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన ఎలమంచిలి రూరల్ అదనపు ఎస్‌ఐ ననేపల్లి సత్యనారాయణ, సీసీఎస్ ఎస్‌ఐ నట్టి సత్యనారాయణ, అనకాపల్లి ట్రాఫిక్ అదనపు ఎస్‌ఐ షేక్ రషీద్, పీసీఎస్ ఎస్‌ఐ షేక్ మదీనా వల్లి, డీసీఆర్‌బీ ఏఎస్‌ఐ జి.అర్జునరావు, పరవాడ ఏ్‌ఎస్‌ఐ బి.ఎ. నాయుడులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎ.ఓ.ఎ.రామ్‌కుమార్, సీఐలు ఎస్.లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, ఎస్.బాల సూర్యారావు, టి.లక్ష్మి, కె.అప్పలనాయుడు, బి.రామకృష్ణ, ఎస్‌ఐ బి.సురేష్‌బాబు, పి.రమేష్, పి.కామేశ్వరరావు, ఎస్.శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.