
చురుగ్గా రైల్వే జోన్ పనులు
ఆరిలోవ(విశాఖ): ముడసర్లోవ వద్ద నిర్వహిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ముడసర్లోవ ప్రాంతంలో విశాఖ కేంద్ర కారాగారం ఎదురుగా రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. దీనిలో సుమారు ఆరు నెలల కిందట ల్యాండ్ టెస్టింగ్ పనులు చేపట్టడంతో పనులు ప్రారంభించారు. నెల రోజులుగా పూర్తిస్థాయి పనులు జరుపుతున్నారు. ప్రస్తుతం 14 ఎకరాల్లో విశాలమైన 12 అంతస్తుల భవనం నిర్మాణం పనులు చేపట్టారు. అండర్ గ్రౌండ్‌లో రెండు ఫ్లోర్లు, పైన 10 ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. వర్షా కాలంలో పనులకు ఎలాంటి ఆటంకంగా రాకుండా ముందు జాగ్రత్తగా ఇసుక తీసుకొచ్చి నిల్వ ఉంచారు. రైల్వే జోన్ రీజనల్ మేనేజర్ కార్యాలయంతోపాటు ఉన్నతాధికారుల క్వార్టర్స్ అన్నీ ఇక్కడే నిర్మిస్తున్నారు.