
టార్గెట్లు పూర్తి చేయడం మా వల్ల కాదు
● గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగుల ఆవేదన
నక్కపల్లి: పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని,నెలవారీ టార్గె ట్లు పూర్తిచేయడం మా వల్లకాదంటూ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. యలమంచిలి సబ్ డివిజన్ పరిధిలో పలు గ్రామాల్లో పనిచేస్తున్న జీడీఎస్‌లు ఆదివారం ఉపమాకలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఎస్‌బీ అకౌంట్లు, ఐపీపీబీ అకౌంట్లు,టీడీ పాలసీలు సుకన్యయోజన పథకం టార్గెట్లు ఇచ్చిన సకాలంలో పూర్తిచేయలంటూ ఒత్తిడి చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈసమావేశంలో జీడీఎస్ ఉద్యోగుల డివిజన్ కార్యదర్శి డి.ఎస్.ఆర్. ప్రసాద్,మాజీ కార్యదర్శి కె. మనోహర్,సంఘనాయకులు విశ్వేశ్వరరావు, సీహెచ్ భద్రం, దయానంద్,బి.వి.రమణ,నాగేంద్రరావు, సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.