
బైక్‌పై తరలిస్తున్న 56 కిలోల గంజాయి పట్టివేత
కె.కోటపాడు : ఆనందపురం కూడలి వద్ద ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన చెల్లం తవాసీని ఎ.కోడూరు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఆనందపురం కూడలి వద్ద సిబ్బందితో కలిసి ఎస్‌ఐ వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటువైపుగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న చెల్లం తవాసీని పోలీసులు ఆపారు. వాహనానికి రెండు వైపులా ఉంచిన సంచులను కిందకు దించి తనిఖీలు చేయగా.. 56 కిలోల గంజాయిని గుర్తించారు. ద్విచక్ర వాహనం, నిందితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి, చెల్లం తవాసీపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. పట్టుకున్న 56 కిలోల గంజాయి విలువ రూ.2.80 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు.